రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ హోలీ పండుగ సందర్భంగా తెలియజేయు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు
హోలీ పండుగ సందర్భంగా రోడ్లపై బైకులు అడ్డంగా పెట్టి, ప్రయాణికుల బస్సులకు ఇతర వాహనాల వారికి అంతరాయం కలిగించకూడదన్నారు.ముఖ్యంగా మహిళలపై అమ్మాయిలపై అనవసరంగా రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడునాని మీడియా సమావేశంలో తెలిపారు.హోలీ పండుగ సందర్భంగా ప్రధాన కూడళ్ల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయబడును ఇందుకు వాహనదారులందరూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు స్ హాస్పటల్, దేవాలయాలు, చర్చి మసీదులు, మొదలైన ప్రాంతాలలో రంగులు చల్లి ఇతరులకు ఇబ్బందులకు గురి చేయకూడదు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరం. కావున రేపు ఎవరు కూడా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అలా చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోబడును.హోలీ అనంతరం పిల్లలు మరియు యువకులు స్నానం చేయడానికి చెరువులు మరియు బావుల వద్దకు వెళుతుంటారు, తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు.
:-హోలీ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు ఎల్లారెడ్డిపేట పోలీసులు సహకరించాలని అన్నారు
