ముస్తాబాద్, అక్టోబర్18, కొండాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామాకు సిద్ధమైన సర్పంచ్ .. ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామ సర్పంచ్ యారటి లక్ష్మీ కర్ణాకర్ గ్రామ అభివృద్ధి కొరకు అప్పులు తెచ్చి గ్రామ అభివృద్ధికోసం డబ్బులు వెచ్చిస్తే బిల్స్ రాక ఉన్న భూమిని అమ్ముకున్నానని బిఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే వట్టి చేతులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఇదేవిధంగా బిఆర్ఎస్ పార్టీలో పలువురు నాయకులు కూడా నా విధంగా అసతృప్తి వ్యక్తం చేస్తున్నారని కెటిఆర్ పిఏ మా అన్నగారైన మహేందర్ రెడ్డి సొంత గ్రామం కొండాపూర్ గ్రామంలో ఇలాఉంటే బతికేదెలా అని కంటతడి పెట్టారని సమాచారం. ఇప్పటికే మూడు నెలల క్రితం బిఆర్ఎస్ పార్టీలో సుర్గా పనిచేసి విరమించుకొని ఉప సర్పంచ్ రాజీనామా చేశారని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్న బిజెపి నేత లగిశెట్టి శ్రీనివాస్ చిగురు వెంకన్న తదితరులు వారి గృహమున తదితర విషయాల గురించి భయపడకు మేమున్నామంటూ బస చేశారని పేర్కొన్నారు.
