ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్18, ఆవునూర్ గ్రామంలో దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12.వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవలే ప్రపంచ వేధిక పై భారత దేశం కీర్తినీ రెట్టింపు చేసిన దిశ దశ చాటిన ISRO ప్రవేశ పెట్టిన చంద్రయాన్-3 రాకెట్ నమూనాను సుమారు 20 మీటర్ల ఎత్తుతో ప్రవేశపెట్టారు. ఇటు భక్తులతో పాటు గ్రామ ప్రజలు సందర్శిస్తూ ఆ నిర్వాహకులను కొనియాడుతు సంబరపడుతున్నారు. సెల్ఫీలు ఫొటోలతో ఆ ప్రాంతం కన్నుల విందుగా తయారైంది. ఆమూడూ గ్రామల ఎంపిటిసి సౌల్ల లలిత యువతులో వచ్చిన నూతన ఆలోచన నైపుణ్యాన్ని కొనియాడుతూ భక్తితో పాటు దేశభక్తి ముఖ్యమని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
