ముస్తాబాద్, ప్రతినిదీ వెంకటరెడ్డి అక్టోబర్18, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పలు సభల్లో పాల్గొనేందుకు ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగం పేటకు చేరుకొన్నారు. ఏఐసిసి సభ్యులు, టిపిసిసి ఉపాధ్యక్షుడు ప్రోటోకాల్ ఛైర్మెన్ హార్కర వేణు గోపాల్ రావు వారికి పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
