ప్రాంతీయం

మండల స్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ లో అందె పాఠశాల విద్యార్థుల ప్రతిభ.

151 Views

మండల స్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ లో అందె పాఠశాల విద్యార్థుల ప్రతిభ.

 సిద్దిపేట జిల్లా  మిరుదొడ్డి. డిసెంబర్ 30 

మిరుదొడ్డి జడ్పీహెచ్ఎస్ మండల కేంద్రంలో సాంఘిక శాస్త్ర మండల ఫోరం ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. పదవ తరగతి(ఈ /ఎమ్ ) విద్యార్థులకు. ఇందులో వివిధ గ్రామాల నుంచి అందే ,కొండాపూర్, అల్వాల్, మిరుదొడ్డి, కాసులబాద్, మల్లుపల్లె, చేప్యాల, కేజీబీవీ, మిరుదొడ్డి మోడల్ స్కూల్ విద్యార్థులకు మిరుదొడ్డి మండల స్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ డాక్టర్ .ఎస్ . వెంకట రామ లింగం ప్రధానోపాధ్యాయులు జడ్పిహెచ్ఎస్ మిరుదొడ్డి ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ లో అందె పాఠశాలకు చెందిన విద్యార్థులు విజేతలుగా రావడం జరిగింది ద్వితీయ స్థానాలను కైవాసం చేసుకోవడం జరిగింది. ప్రథమ ద్వితీయ స్థానాలు సంపాదించడం పాఠశాలకు రావడం గర్వకారణం అని పాఠశాల ఉపాధ్యాయ బృందం, కొనియాడారు.

విజేతలు

1st ఆర్. అశ్విత s/o కుమార్

2nd పి.కావ్య s/o రాములు విద్యార్థులు మండల స్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ లో ఫస్ట్ ,సెకండ్ రావడం జరిగింది. వీరికి మిరుదొడ్డి మండల జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. దీనికి కృషి చేసిన మన పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కే. కనకరాజ్ సార్ గారికి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందానికి అందె గ్రామస్థులు యువకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్