తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్యాల నర్సింలు..
సిద్దిపేట:
బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రవర్ణ పేద బిడ్డలకు అనాధ పిల్లలకు నిజమైన విద్య అందించేందుకు నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని సిఎం కేసీఆర్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్యాల నర్సింహులు తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పేరెంట్స్ కమిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. మైనార్టీగురుకుల పాఠశాలలో 12వ తరగతి కంప్లీట్ చేసిన విద్యార్థుల కోసం వాటిని డిగ్రీ కాలేజీలుగా అప్డేట్ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, దీనివల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 200 గురుకులాలు మాత్రమే ఉంటే నేడు తెలంగాణలో మాత్రమే ఒక వెయ్యి గురుకులాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.అలాగే అన్ని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య తో పాటు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారని కొనియాడారు. గురుకుల పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు IIT NIT III MS గా విదేశాలలో విద్యాభ్యసిస్తున్నారు. అలాగే ఎంబిబిఎస్ సీట్లలో కూడా గురుకుల పాఠశాల విద్యార్థులకు మంచి ఫలితాలను రాబట్టారు మొన్న జరిగిన ఆసియా క్రీడలలో కూడా గురుకుల ప్రాతినిధ్యం వహించి తెలంగాణ రాష్ట్రానికి కాదు దేశానికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన విద్యార్థులలో గురుకుల విద్యార్థి ఒకరని ఈ సందర్భంగా కొనియాడారు.ఇప్పటికీ కొన్ని గురుకుల పాఠశాలలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని వీటిని శాశ్వత భవనంలోకి మార్చి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చి. విశాల క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో టిజిపిఏ ప్రధాన కార్యదర్శి నాయకులు శ్రీరాంల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు ఎలుక దేవయ్య, సానార్ది నర్సింగ్ రావు, జాలిగామా నర్శింగరావు, కవిత, స్వరూప, లలిత, స్వప్న,
ఎల్లయ్య, శ్రీనివాస్, బాబు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.