రాబోయే శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ఒకసారి అవకాశం కల్పించి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఓటర్లను విజ్ఞాప్తి చేశారు. బుధవారం ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రేమ్ సాగర్ రావును గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలు లేకుండా అభివృద్ధి పై దృష్టి పెడతారని అన్నారు. గత ఎన్నికల్లో ఒడిపోయినప్పటికి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. నవంబర్ లో జరుగనున్న ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావుకు పట్టం కట్టాలని కోరారు. ఇప్పటికి ఆశించిన స్థాయిలో నియోజకవర్గం అభివృధ్ధి చెందలేదని వారన్నారు. 20 ఏండ్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గం భవిష్యత్తు అంధకారం చేసారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో కి వస్తే తెలంగాణ ప్రజల జీవితాలు బంగారుమయం అవుతాయని అన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాల ను అమలు చేసి ప్రజా సంక్షేమ పాలన తెస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కి రావడం తథ్యమని చెప్పారు.
