ఎల్లారెడ్డిపేట మండలం:-ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించు పాఠశాలల క్రీడా సమాఖ్య పోటీలలో భాగంగా నిన్న ఇల్లంతకుంట మండల కేంద్రంలో జరిగినటువంటి ఉమ్మడి కరీంనగర్ లోని నాలుగు జిల్లాల అండర్ 17 బాల బాలికల ఆటల పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన జెడ్ పి హెచ్ ఎస్ బొప్పాపూర్ పాఠశాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలు,ఇద్దరు అబ్బాయిలు చల్ల సాహితీ, ముత్యాల శ్రీహర్ష, ముత్యాల మనోజ్, అల్లే మనోజ్ ఈనెల 19 నుంచి 22 వరకు మహబూబ్ నగర్ జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్టు పి ఈ టి ప్రభాకర్ తెలియజేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం,గ్రామ సర్పంచ్,ఎంపీటీసీ అభినందించారు.
