(తిమ్మాపూర్ అక్టోబర్ 17)
ఇటీవలే ఢిల్లీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు స్వీకరించిన తిమ్మాపూర్ మండలం మన్నేంపల్లి గ్రామనికి చెందిన పారునంది జలపతిని శాలువాతో ఘనంగా సన్మానించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్ ఎమ్మేల్యే డాక్టర్ రసమయి బాలకిషన్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయడం నిజంగా అభినందనీయం అన్నారు.
ఆ మహనీయనీ సిద్దంతాలను ధృడంగా ముందుకు తీసుకెళ్లడంలో కృషికి నిదర్శనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు రావడం గొప్ప విషయం అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కెతిరెడ్డి దేవేందర్ రెడ్డి ,ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి,మండల యూత్ అధ్యక్షులు మాదన రాజేందర్,నాయకులు తమ్మనవెని మల్లన్న,గడ్డి రమేష్,అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కోయడ మురళి,గంగిపెల్లి సంపత్, బొర్రా రావన్న,తూర్పటి అజయ్,సముద్రాల మల్లేశ్,తల్లపెళ్ళి నందకిషోర్,గూడ తిరుపతి,కిన్నెర అంజి,గాజా సాగర్,అలువాల సంపత్,అసంపెల్లి అశోక్,తల్లపెల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.