రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నాబార్డ్ వారి సౌజన్యంతో జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మగ్గం వర్క్ ఎంఈడిపి శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి మనోహర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏజీఎం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కుట్లు ,అల్లికల ద్వారా ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు మగ్గం వర్క్ నేర్చుకొని ఈ 15 రోజుల శిక్షణ కాలంలో మధ్యాహ్నం భోజనం రోజుకి 50 రూపాయలు చొప్పున స్టిపెండ్ తో పాటు 15 రోజులకు 750 రూపీస్ తో పాటు సర్టిఫికెట్ను కూడా అందజేయడం జరుగుతుందన్నారు. మగ్గం వర్క్ ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని కుటుంబానికి ఆర్థిక చేయూత అందించాలని మహిళలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని నాబార్డ్ ఏ జీ యం మనోహర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో జనవికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యదర్శి పెండ్లి సంపత్ కుమార్ రాజన్నపేట సర్పంచ్ ముష్క శంకర్ తోపాటు జన వికాస ప్రతినిధులు రాజు మరియు మగ్గం వర్క్ ట్రైనర్ మనీషా వివోఏలు 30 మంది స్వశక్తి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
