Breaking News

దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న సిరిసిల్ల వాసులు

123 Views

జ్యోతి న్యూస్ – రాజన్న సిరిసిల్ల

ఏజెంట్ మోసాలకు బలైన యువకులు

– ఇండియాలో చెప్పిన పని జీతం కావాలని కంపెనీ తో వాదన

– తాగి గొడవ చేస్తున్నారని కేసులు నమోదు

– మీపై కేసులు ఉన్నాయి మీరు ఇండియాకు వెళ్ళరాదని ఎయిర్ పోర్ట్ నుండి బయటకు గెంటివేత

– తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేవు, ఎయిర్పోర్ట్ బయట వేచి చూస్తున్న యువకులు

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నలుగురు యువకులు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక్క యువకుడు, దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. దుబాయ్ లోని ఓ కంపెనీ సిరిసిల్ల మరియు వేములవాడ, నిజామాబాద్ జిల్లా ఏజెంట్ల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఇండియాలో చెప్పిన పని మరియు జీతం అక్కడ ఇవ్వలేదంటూ కంపెనీతో అయిదుగురు యువకులు వాగ్వాదానికి దిగారు. కంపెనీ పోలీసులను పిలిపించి తాగి న్యూసెన్స్ చేస్తున్నారని కేసులు బుక్ చేయించారు. అయినా యువకులు వినక పోవడంతో మీరు ఇండియా నుంచి టికెట్ తెప్పించుకోండి మిమ్మల్ని ఇండియాకు పంపిస్తామని చెప్పారు. ఐదుగురు యువకులు ఇంటి దగ్గర నుంచి టికెట్లు తెప్పించుకున్నారు. కంపెనీ వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు వాళ్లకు ఇచ్చి ఎయిర్పోర్ట్ వద్ద వదిలేశారు. నిన్నటి రోజున రాత్రి దుబాయ్ నుండి ఇండియాకి రావలసి ఉంది. యువకులు పాస్పోర్ట్లు టికెట్లు తీసుకొని ఎయిర్ పోర్ట్ లోనికి వెళ్లారు. ఐదుగురికి ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ పాస్ పూర్తయింది. కానీ ఎయిర్పోర్టులో అక్కడి పోలీసులు వాళ్ల పాస్పోర్టులు చెక్ చేయగా మీ పైన కేసులు ఉన్నాయి మీరు ఇండియాకి వెళ్లరాదని చెప్పి ఎయిర్ పోర్ట్ నుండి బయటకు పంపించారు. ఇట్టి యువకులు సదరు ఏజెంట్లకు మరియు కంపెనీకి ఫోన్ చేయగా ఎవరు స్పందించకపోవడంతో ఎయిర్పోర్ట్ వద్దనే ఉండి ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులకు ఇట్టి విషయాన్ని మరియు తాగడానికి నీళ్లు తినడానికి తిండి లేదని తెలిపారు. ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వీరని వెంటనే ఇండియాకు తెప్పించాలని వేడుకుంటున్నారు

Oplus_131072
Oplus_131072
Anugula Krishna