Breaking News

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్.

95 Views

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్.

తెలంగాణ, మహారాష్ట్ర, చతీష్ ఘడ్ సరిహద్దు జిల్లాల పోలీసులతో సమావేశం.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చతీష్ ఘడ్ పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ లో . అంకిత్ గోయల్, IPS.,Dy, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చిరోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇట్టి సమావేశానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ)గారు అధ్యక్షత వహించి, రాబోయే ఎన్నికలకు దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహాద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి, ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. ఫలితంగా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరమవుతుందని ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించవచ్చని సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. మెదట గా రామగుండం పోలీస్ కమీషనర్ గారు, ఆసిఫాబాద్ ఎస్పీ, భూపాలపల్లి ఎస్పీ, మంచిర్యాల డీసీపీ రామగుండం కమీషనరేట్ ఆఫీస్ లో ఉన్న హెలిపాడ్ నుండి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి వెళ్లి సమావేశం కి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సమావేశం లో అధికారులు మాట్లాడుతూ… మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషిచేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు, మూడు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని అన్నారు. తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల తో సరిహద్దులో వున్న సమస్యాత్మకమైన గ్రామల పై ప్రత్యేక దృష్టి సారించాలని, NBW వారెంట్స్ ల విషయం లో మూడు రాష్ట్రాల పోలీసులు ఒకరి ఒకరు సహకరించుకోవాలని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని.సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాల కట్టడి, కేసుల విషయంలో ఒకరికొకరు సహకరించుకుందామని కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవా ల్సిన చర్యలపై ఇరురాష్ట్రాల అధికారులు చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

No Slide Found In Slider.

Poll not found