అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది
అక్టోబర్ 27
సిద్దిపేట జిల్లాలోని చుంచనకోట గ్రామంలో ఆర్ధిక అక్షరాస్యత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్బిఐ లీడ్ డిస్ట్రిక్ ఆఫీసర్ తాన్య సంఘమా మాట్లాడుతూ రద్దు చేసిన 2000 నోట్లు ఇంకా ఎవరి దగ్గర అయినా ఉంటే వాటిని హైదరాబాద్ ఆర్బిఐ ఆఫీసు లో మార్చుకోవాలని సూచించారు.
అలాగే సిద్దిపేట జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ సత్యజిత్ మాట్లాడుతూ తీసుకున్న లోన్ సరియైన సమయంలో కట్టడం ద్వారా భవిష్యత్తులో ఎక్కువ లోన్ పొందే అవకాశం ఉంటుందని అలాగే పిల్లలకు ఎటిఎం కార్డు ఇచ్చి వాటి సమాచారం ప్రైవేట్ అప్స్ లో దాచి ఉంచడం ద్వారా నష్టపోయే ప్రమాదం ఉందని ఎవరికైనా పై చదువులు కొరకు లేదా ఆర్ధిక అవసరాలకు లోన్ కావాలీ అంటే ఆర్బిఐ అనుమతి పొందిన బ్యాంకు నుండి తప్ప అప్స్ లో లోన్ తీసుకుని నష్టపోవద్దు అని సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకుంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరియు చేర్యాల డీసీసీ బ్యాంకు మేనేజర్ నందిని మేడమ్ మాట్లాడుతూ బ్యాంకు కేవలం లోన్ కోసమే కాకుండా అన్ని రకాల సేవలు అందించేందుకు ఉందని ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య లేక జీవిత భీమా పాలసీ కలిగి ఉండాలని దాని వల్ల కుటుంబము రోడ్డు పాలు కాకుండా ఆర్ధిక భరోసా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డబ్ల్యూ డి సి సి బ్యాంకు నోడల్ మేనేజర్ బ్యాంకు సిబ్బంది ఎఫ్ సిఎల్ కౌన్సిలర్ దయాకర్ చేర్యాల సి ఎఫ్ ఎల్ కో ఆర్డినేటర్ పోతుగంటి కరుణాకర్ సాయి కుమార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు
