సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 12
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మెమ్మజిగారి రమేష్ గడ్డి మంది సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.రెండేళ్లుగా పక్షవాతం,ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై గడ్డి మందు తాగాడు.ఆసుపత్రిలో చికిస్తపొందుతూ రమేష్ మృతి చెందారు.రమేష్ తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
