(కరీంనగర్ అక్టోబర్ 12)
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద రెడ్ల అభ్యున్నతికై రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రెడ్డి జేఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూర మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లోని ఆయన నివాసంలో కలిసి రానున్న అసెంబ్లీ ఎన్నికల బీజేపి మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ అంశాన్ని చేర్చాలని కోరగా, బండి సంజయ్ సానుకూలంగా స్పందించి తప్పకుండా మేనిఫెస్టోలో చేరుస్తామని బిజెపి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బండ రమణారెడ్డి, ఒంటెల కరుణాకర్ రెడ్డి, శివారెడ్డి, శశిధర్ రెడ్డి, పూర్ణ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




