రామగుండం పోలీస్ కమిషనరేట్
ప్రియుడి తో కలసి బర్తని హత్యమర్చిన భార్య ని, ప్రియుడిని మరియు అందుకు సహకరించిన వారిని అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు.
తేదీ 29-10 -2023 రోజు రాత్రి రామగుండం పరిధి లో జరిగిన హత్య కేసు నిందితులను 48 గంటలు తిరక్కముందే రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
మాల్యాలపల్లి సబ్ స్టేషన్ కి సమీపంలో తేదీ 29-10-23 రోజున రాత్రి సమయంలో మెయిన్ రోడ్డు పక్కన సైడ్ కెనాల్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడనే సమాచారం మేరకు రామగుండం ఎస్ ఐ వెంకటేష్ , సి ఐ, చంద్ర శేఖర్ గౌడ్, ఏ సీ పీ తుల శ్రీనివాస్ రావు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి ఆనవాళ్ళ కోసం ప్రయత్నం చేయడం జరిగింది.
చనిపోయిన వ్యక్తి పేరు లావుడియ మధుకర్, తండ్రిపేరు: నాన్యా నాయక్, 30 సం, నివాసం: పోతన కాలనీ,8 ఇంక్లైన్ కాలనీ అని తెలిసినది.
మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేయగా నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చింది మృతుడిని అతడి భార్య లావుడియా @ నునసవత్ రమ తన అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని తన ప్రియుడు గోవర్ధన్ మరో ఇద్దరితో కలసి పథకం ప్రకారం హత్య చేసినారని తెలిసింది.
ఇట్టి పత్రికా సమావేశంలో ఏసిపి వెంట రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రామగుండం ఎస్సై వెంకట్ పాల్గొన్నారు.
