Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట మండల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

412 Views

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బండారి శేఖర్  (48) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డిపేట నుంచి ముస్తాబాద్ వెళ్తుండగా బండ లింగంపల్లి గ్రామ శివారు వద్ద మల్లారెడ్డిపేటకు చెందిన బాలు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో వడ్ల కుప్పను తప్పించబోయి శేఖర్ ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శేఖర్ కు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా బాలు తీవ్ర గాయలై కాలు చేతులు విరిగింది. వెంటనే స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్