రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కొడుకును చంపిన తండ్రి. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలో కొడుకు వేధింపులు భరించలేక తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన కుంట రమేష్(42) అని వ్యక్తి గత కొంతకాలంగా తండ్రి సాయిలు తల్లి మల్లవ్వను వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శనివారం ఉదయం తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టగా తండ్రి తీవ్ర కోపద్రికుడై గొడ్డలితో ఉదయం ఏడు గంటలకు తలపై నరకడంతో కొడుకు రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల అదుపులో తండ్రి సాయిలు.
