అక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో గల రాళ్ల వాగు పై ఎత్తువంతన నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన సందర్భంగా బైపాస్ లోని రాళ్ల వాగు వద్ద కృతజ్ఞత సభ నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
ఎమ్మెల్యే దివాకర్ రావు కామెంట్స్
1) బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ప్రజలకు మేలు జరుగుతుంది.
2) ప్రతిపక్షాలు బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధినీ ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
3) గతంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినప్పటికీ ప్రతిపక్ష నేతలు కళ్ళు మూసుకొని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
4) తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటారు. ప్రతిపక్ష నాయకుల మాయమాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు.
