(తిమ్మాపూర్ అక్టోబర్ 12)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ వాదాన్ని,సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుడాన్ని గుర్తిస్తూ బహుజన సాహిత్య అకాడమీ,న్యూఢిల్లీ వారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పారునంది జలపతికి డాక్టర్ బి.అర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు కు ఎంపిక చేశారు.
ఈ మేరకు బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ ఆఫ్ ఇండియా- 2023 సంవత్సరానికి గాను, జలపతిని ఎంపిక చేస్తూ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ సమాచారం అందించారు.ఈ అవార్డును అక్టోబర్ 15న ఢిల్లీ లో జరుగనున్న 4వ కాన్ఫరెన్స్ లో ప్రధానం చేయనున్నట్లు వారు తెలిపారు.
పార్నంది జలపతి కి నేషనల్ అవార్డ్ వచ్చినా సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపన్న,జిల్లా అధ్యక్షులు సాంబారి కొమురయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్,సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు,రేణికుంట సర్పంచ్ బొయిని కొమురయ్య, రామకృష్ణ కాలనీ సర్పంచ్ మీసాల అంజయ్య,జిల్లా ఉపాధ్యక్షులు వంతడుపుల సంపత్,సహాయ కార్యదర్శి కోయడ మురళి,నియోజకవర్గ అధ్యక్షులు గంగిపల్లి సంపత్,మండల గౌరవ అధ్యక్షులు బొర్రా రావన్న,ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ తోపాటు పలువురు నాయకులు అభినందించారు.