–లబ్ధిదారుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలి.
–మాజీ ఎమ్మెల్యే,బీజేపి నాయకులు ఆరేపల్లి మోహన్.
(తిమ్మాపూర్ అక్టోబర్ 18)
దళితుల సంక్షేమంపై పట్టింపులేని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళిత ద్రోహిగా మారిపోయాడని మాజీ ఎమ్మెల్యే,బీజేపి నాయకులు అరేపల్లి మోహన్ ఆరోపించారు.తిమ్మాపూర్ మండల కేంద్రములో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అంతకుముందు సుమారు 70 మందికి పైగా కార్యకర్తలు బైక్ ర్యాలీ తో మోహన్ కు స్వాగతం పలుకుతూ గ్రామంలో కలియతిరిగారు.
అనంతరం నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ..
ప్రభుత్వ పథకాల అమలు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.గ్రామాల్లో కొంతమంది దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రాం లాంటి మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ విషయంలో తన పేరు ఉంటేనే ఆవిష్కరణ చేయాలని లేదంటే ఆవిష్కరణ చేయకుండా ఆపేస్తున్నాడని ఇది సమాంజసమేనా అని ప్రశ్నించారు.
డబుల్ బెడ్రూమ్, దళిత బందు, బీసీ బందు, గృహలక్మి లాంటి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో అర్హులైన వారిని ఎంపిక చేయకుండా ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో విషయంలో ఆచరణకు సాధ్యం ని పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం జరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.మహిళా సాధికారకత విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులు లేవని అంటున్న రసమయి బాలకిషన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులేనని 48 గంటలలో వాటికి సంభందించిన జిఓ పత్రాలను మీడియా ముఖంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రైతులకు వచ్చే పలు రకాల సబ్సిడీలను ఎందుకు ఇవ్వడం లేదనీ ఒక్కరైనా అసెంబ్లీ లో ఎందుకు మాట్లాడలేదో రసమయి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసారు.ప్రజల కష్ట సుఖాలను పట్టించుకునే వారికే ఓటు వేసేలా ప్రజలు ఆలోచించాలని కోరారు.స్థానికుడు కానీ వారికి ఈసారి ఎన్నుకోవద్దని ఆయన కోరారు.గత పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలు పడే భాదలను గమనించి బీజేపీ లో చేరి ఎమ్మెల్యే గా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మోహన్ పేర్కొన్నారు.పార్టీ సిద్దాంతం కోసం కష్ట పడే బీజేపి కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తు పై విస్తృత ప్రచారం చేయాలని కోరారు.
తిమ్మాపూర్ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, రంగు భాస్కరాచారి,నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మాజీ జడ్పిటీసి ఎడ్ల జోగిరెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, మావురపు సంపత్, మానకొండూర్ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, మండల ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతం వరలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.