రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని లింగన్నపేట గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1993+94 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం గురువారం పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిన్న రాములు, గోవర్ధన్ రెడ్డి, కిషన్ రావు, మరియు వివిధ జిల్లాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు 54 మంది హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని ఆహ్లాదంగా గడిపారు 29 సంవత్సరాలు తర్వాత కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు ఇందులో బైరగోని విజయకుమార్ గౌడ్ అనే విద్యార్థికి గత రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం రాగా విద్యార్థులు అందరూ కలిసి అతనికిఆర్థిక సాయం అందించాలని అలాగే శాశ్వత పరిష్కారం చూపించాలని నిర్ణయం తీసుకున్నారు అనంతరంఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఉమాశంకర్, విష్ణు ప్రసాద్, బి శ్రీనివాస్, రజనీకాంత్ రెడ్డి, పెద్ది శ్రీనివాస్, ఆంజనేయులు, అశోక్ రావు, శెట్టి కృష్ణ పర్శరాములు, మమత, విజయ, సంగీత, మాధవి, భ్రమరాంబ,అంజలి, పద్మ,రజిత,మంజుల, జలేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
