94-95 పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామం లో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 1994-1995 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారికి బోధించిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించి ఉపాధ్యాయులతో వారికున్న అనుబంధాలను జ్ఞాపకం చేసుకుంటూ వారికి బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి మెమెంటోలు అందించారు ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు వైకుంఠం, నాగేంద్రం, ఆనందాచారి, నర్సింగారావు, మధుసూదన్ రెడ్డి, నరేందర్ రెడ్డి,పూర్వ ఉపాధ్యాయులు తోపాటు ప్రస్తుత జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వంగాల నరేందర్, గంజి శివకుమార్, కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, పరుశరాములు, మనోహర్, ఇసాక్, భాను డాక్టర్, పద్మ, రజిత, మంజుల, జ్యోతి, మమత, తో పాటు 60 మంది పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు




