రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ బృందం. . రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఎల్లారెడ్డిపేట
రాజీవ్ రహాదారిలో ప్రజ్ఞాపూర్ సమీపంలోని గౌరరం సింగాయపల్లి గ్రామాల మద్య గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వెలుగు తెలుగు దిన పత్రిక విలేఖరి బుగ్గ కృష్ణ మూర్తి శర్మ ను ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ బృందం శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కు వెళ్ళి పరమర్షించారు , సీనియర్ జర్నలిస్ట్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ అతని బార్య మాదవి , కూతురు శ్రీ నిధి ,కుమారుడు సాయి సిద్దార్థ లతో కలిసి గురువారం సాయంత్రం హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రమాదవశత్తు రాజీవ్ రహాదారిలోని గౌరరం సింగాయపల్లి గ్రామాల మద్య రాజీవ్ రహాదారిలోని కల్వర్టు ను డీకొనడంతో నలుగురు గాయపడ్డారు , ,వెంటనే అక్కడి పోలీసులు ప్రజ్ఞాపూర్ లోని ఆదిత్య ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అక్కడే మాదవి తలకు భలమైన గాయాలు కావడంతో వైద్య పరీక్షలు స్కానింగ్ చేశారు, పరిస్థితి ప్రమాదకరమని అక్కడి వైద్యులు వెల్లడించడంతో అనంతరం ఆమేను సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి స్నేహితుల సహాయంతో తరలించామని ప్రస్తుతం సీఐసియూలో చికిత్స పొందుతుందని కృష్ణమూర్తి ప్రెస్ క్లభ్ బృందానికి తెలిపారు , తాను తన పిల్లలు ప్రస్తుతం సురక్షితంగా
నే ఉన్నామన్నారు , కృష్ణమూర్తి ని ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లభ్ అద్యక్షులు మజీద్ , బండారి బాల్ రెడ్డి , కార్యదర్శి షరీఫ్ , నాగరాజు గుప్తా , కె జగధీష్ , నరేష్ , కిశోర్ , దుర్గం విజయ్ , ప్రవీన్ , రవి తదితరులు వెళ్ళి పరామర్శించారు , త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యశోద హాస్పిటల్ కు శనివారం రాక* గురువారం రాజీవ్ రహాదారిలో ని గౌరరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వెలుగు తెలుగు విలేకరి బుగ్గ కృష్ణమూర్తి శర్మను అతని కుటుంబ సభ్యులను ప్రరమర్శించడానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్ కు పమర్శించడానికి రానున్నట్లు టిఆర్ఎస్ పార్టీ అధికార వర్గాలు తెలిపాయి ,




