అక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7
అక్టోబర్ 08 కోరుట్ల జగిత్యాల జిల్లా
కోరుట్ల ఆర్టీసీ బస్సు డిపోలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు రాజధాని బస్సుకు నిప్పంటుకోవడంతో ఏసీ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయింది.
హైదరాబాద్ నుండి కోరుట్లకు ప్రయాణీకులను తరలించిన తరువాత డిజిల్ కోసం డిపోకు బస్సును తీసుకెళ్లారు.
ఆ తరువాత బంకు సిబ్బంది డిజిల్ ఫిల్ చేసిన కొద్దిసేపటికి అకస్మాత్తుగా బస్సులోపల నుండి మంటలు చెలరేగాయి.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
