గాంధీ ఆసుపత్రిలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించిన: హోం మంత్రి
హైదరాబాద్:అక్టోబర్ 08
సంతానం లేక ఇబ్బందులు పడుతున్న దంపతుల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్, సెంటర్‌ను తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలోని మాతా,శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆదివారం నాడు హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.





