ప్రాంతీయం

సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా 500 బోనస్ ఇవ్వాలి – బిజెపి

510 Views

*రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకే 500 బోనస్ ఇస్తాం అని చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ భీమారం మండల కేంద్రంలో రైతుల పక్షాన మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ బీజేపి నాయకుల నిరసన*

నేడు రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షులు *వెర్రబెల్లి రఘునాథ్ రావ్*  చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్ధి జిల్లా ప్రధానకార్యదర్శి *దుర్గం అశోక్*  పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు పండించిన అన్ని వడ్లకు బోనస్ ఇస్తాం అని చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పుడు కొన్నిటికే ఇస్తాం సన్న వడ్లకే బోనస్ ఇస్తాం దొడ్డు వడ్లకు ఇవ్వం అనడాన్ని కండిస్తూ నిరసన తెలపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మరోసారి ఆలోచించి మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి నిలబెట్టుకోవాలని సన్న వడ్లతో పాటు అన్ని వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతు డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో రైతుల పక్షాన ఎక్కడికి అక్కడ నిరసన కార్యక్రమాలు మరింత ఉదృతం చేస్తామని తెలుపడం జరిగింది.

ఈకార్యక్రమంలో భీమారం మండల అద్యక్షులు బోర్లకుంట శెంకర్ ఇంఛార్జి ఆలం బాపు, బీజేపి మండల ప్రధానకార్యదర్శి మాడెం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కొమ్ము దుషాంత్ యాదవ్ ఏల్పుల సతీష్ దుర్గం కత్తెరసాల కార్యదర్శులు ఆకుదారి శెంకర్,దుర్గం రాములు మహిళ మోర్చ మేడి విజయ, యువ మోర్చ ప్రధానకార్యదర్శి దూట వినోద్ , దుర్గం మహేష్ తో పాటు రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్