Breaking News

గిరిజనులకు కేసీఆర్ 10 %రిజర్వేషన్ ఇచ్చినందుకు కేసీఆర్ చిత్ర పటము కు పాలాభిషేకం

102 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని వివిధ గిరిజన గ్రామ పంచాయతీల సర్పంచ్ మరియు ఎస్టీ సెల్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గిరిజన రిజర్వేషన్ 6% శాతం నుండి10% శాతం పెంచినందుకు గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన పని యావత్తు భారతదేశ విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా రిజర్వేషన్ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారు 10 శాతానికి పెంచడం వారికి గర్వకారణం అని గిరిజన వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా వారు చేసిన పనులు గుర్తు చేసుకుని తండాలను గ్రామపంచాయతీలుగా చేసి వారి నాయకత్వాన్ని వారే వహించేటట్టుగా గ్రామపంచాయతీలుగా తీర్చి దిద్దిన ఘనత కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని వారు అన్నారు. ఇంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రిలు పరిపాలించిన మన రాష్ట్రానికి గిరిజనులకు పట్టించుకున్న నాధుడే లేడని వారు అన్నారు.
అయితే ఆనాడు బ్రిటిష్ మరియు నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గిరిజన ఆది నాయకుడు కొమరం భీమ్ వంటి నాయకుడు నీ గుర్తించి వారి యొక్క స్మృతిని గుర్తు పెట్టుకొని 10 ఎకరాల స్థలాలను వారి సమాధి గురించి కేటాయించి వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించారు ఈ విషయము యావత్తు గిరిజన తండాలకు గర్వకారణం అని వారు చెప్పుకోవచ్చు. అలాగే ఒకటి కాదు రెండు కాదు ఇలా చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న గిరిజన ఆదివాసి భవనం, సేవాలాల్ భవనం హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించడం గిరిజనులకు మరిచిపోలేని ఒక గుర్తింపు అని అది ఒక దమ్మున్న నాయకుడు కేసీఆర్ వల్లనే అవుతుందని వారు ఈ వేదికను ఉపయోగించి గుర్తు తెచ్చుకున్నారు. అలాగే పోడు భూముల సమస్యలను కూడా పరిష్కరించినందుకు మరియు ఈ 10 శాతం రిజర్వేషన్ కి వారు ఈ రిజర్వేషన్ దానికి విద్య ఉద్యోగ వృత్తి వాణిజ్యపరంగా ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి ఉపయోగపడుతుందని అలాగే వారు ఎదగడానికి మంచి సదవకాశమని వారు హర్షణ వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల ఎంపీపీ వంగ కరుణసురేందర్ రెడ్డి. జెడ్పిటిసి కొమిరి చెట్టి విజయ లక్ష్మణ్ , తెరాస మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు , వివిధ గిరిజన తండాల గ్రామ సర్పంచు, బాల్యా నాయక్,. తేజావత్ రజిత అనిల్ నాయక్, లకావత్ మంజుల రాజ్యా నాయక్, ఎంపీటీసీ మూడు కవిత అంబర్ నాయక్, ఉప సర్పంచ్లు భుక్య ప్రమీల మోహన్ నాయక్ , అలాగే లంబాడి ఐక్యవేదిక మండల అధ్యక్షులు భాస్కర్ నాయక్, గ్రామ ప్రజలు యూత్ అధ్యక్షులు, మూడు భాస్కర్, నగేష్, సురేష్, అజ్మీర్ రవి, గణేష్, సంతోష్ మరియు మహిళలు, మూడు కవిత, గేని, కవిత గిరిజనులు ప్రజలు ప్రజా ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Anugula Krishna