సీపీఐ సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు చేరిక..
నవంబర్ 16
సిద్దిపేట జిల్లాచేర్యాల భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిర్వహిస్తున్న పోరాటాలకు సిద్ధాంతాలకు ఆకర్షితులై సిపిఐలో పలువురు చేరినట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ తెలిపారు. చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన ముచ్చాల రామకృష్ణతో పాటు పలువురు సిపిఐ లో చేరారు. అందే అశోక్ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం నుండి దేశ స్వతంత్య్ర ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సిపిఐ కీలక కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను ఉద్యమాల వైపు నడిపించి ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న పార్టీ సిపిఐ మాత్రమేనని వారన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, కుడిక్యాల బాల్మోహన్, వలబోజు నరసింహాచారి, బండారి సిద్దయ్య, పొన్నబోయిన మమత, నంగి కనకయ్య, తిగుల్ల కనకయ్య ఉన్నారు.
