*పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ CEIR టెక్నాలజీతో ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి బాధితుడికి అప్పగించిన చేర్యాల ఎస్ఐ U భాస్కర్ రెడ్డి
ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల పట్టణం కు చెందిన బుట్టి అనిల్ కుమార్ S/o నర్సింహులు అనే వ్వక్తి తన oppo మొబైల్ ఫోను ను 05-07-2023 న పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్సైట్లో ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ ను ఎంటర్ చేసి, బ్లాక్ చేశాడు. వెంటనే ఫోన్ దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం చేర్యాల పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న వ్యక్తికి చేర్యాల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భాస్కర్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎవరైతే ఫోన్ కోల్పోయిన వారు వెంటనే ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి తొందరగా పొందుతారని తెలిపారు





