అక్టోబర్ 7 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
హాజీపూర్ మండల రైతాంగానికి మేలు చేసే విధంగా 1 పి ఎం సి సామర్ధ్యంతో గోదావరి నీటిని ఎత్తిపోసే విధంగా
రూ80 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న పడ్తనపల్లి లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్కు భూమి పూజ – శంకుస్థాపన చేసిన ఆర్థిక వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ దండే విఠల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.
