ప్రాంతీయం

పొంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

152 Views

ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంబంధిత వైద్యాధికారులతో మాట్లాడి వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రసూతి వైద్య సేవలు, కోవిడ్, టీబీ, డెంగ్యూ కేసుల వివరాల గురించి ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్పటివరకు 31 వేల 308 మందికి మొదటి డోస్, 16 వేల 234 మందికి రెండవ డోస్ వేయడం జరిగిందని సంబంధిత మెడికల్ అధికారి కలెక్టర్ కు వివరించారు. అలాగే గత ఏప్రిల్ మాసం నుండి ఇప్పటివరకు 55 డెలివరీలు చేయడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు. డెంగ్యూ, టీబీ కేసులు నమోదు కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా చూసుకుంటే ఇప్పటివరకు ఎక్కువ డెలివరీలు చేసిన వాటిలో పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందంజలో ఉందని కలెక్టర్ వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, మెడికల్ అధికారి డా. సంజీవ్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7