అక్టోబర్ 6 పెద్దపల్లి జిల్లా:
పెద్దపల్లి నియోజకవర్గంలో ఆరు మండలాలలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాష్ట్ర హరిత మిత్ర అవార్డు గ్రహీత శ్రీ దాసరి మనోహర్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు ఇంటింటికి అందుతున్నాయా అంటూ ఆప్యాయంగా పలకరించారు.
మూడోసారి కెసిఆర్ ను గెలిపిస్తే మరింత అభివృద్ధి ఉంటుందంటూ ఊరు ఊరు ,వాడ వాడ, పల్లె పల్లెనా అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే మాట్లాడుతూ 24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూములు ,దళిత బంధు, పింఛన్లు, మిషన్ భగీరథ మంచినీళ్లు ,రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
