ప్రాంతీయం

జగదేవపూర్ ఎర్రవల్లి మర్కుక్ వర్గల్ మరియు ములుగు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు

103 Views

 

ఈరోజు అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు, గజ్వేల్ ఎసిపి రమేష్, రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎస్ఐలతో కలిసి క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ, చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్, టాయిలెట్స్, ర్యాంపు, తదితర సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సంబంధిత గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. ఓటు యొక్క విలువ దాని యొక్క ప్రాముఖ్యత గురించి సంబంధిత గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ కమిషనర్  ఆధ్వర్యంలో ఎలక్షన్స్ గురించి ముందస్తు ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందన్నారు. బార్డర్ జిల్లాల పోలీస్ అధికారులతో సమన్వయంతో కలిసి విధులు నిర్వహించాలని, సంబంధిత పోలీస్ అధికారులతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని
ఎన్నికలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని షేర్ చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్, ములుగు ఎస్ఐ విజయ్ కుమార్, మర్కుక్ ఎస్ఐ శంకర్, గౌరారం ఎస్ఐ విజయభాస్కర్, మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *