ముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/23; రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్ లో బీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో బీసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ హాస్టల్లో సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు.
ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో పక్కాభవనాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాలని నాణ్యత గల ఆహార అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ హాస్టల్లో మెస్ చార్జీలు పెంచకపోవడంవల్ల నాణ్యమైన ఆహారం లభించడం లేదని విద్యార్థులు చెప్తున్నారు. జైల్లో ఉన్న ఖైదీలకు మంచి ఆహారం అందిస్తుంటే అంతకంటే దారుణంగా విద్యార్థులను చూస్తున్నారని వాపోయారు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం నుండి రావాల్సిన ప్యాకెట్ మనీ కాస్మార్ట్ బిల్లులు కూడా రావడం లేదని చలికాలం ప్రారంభమవుతున్న దుప్పట్లు ఇప్పటివరకు ఇవ్వడంలేదని అన్నారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థి సమస్యలు పరిశీలించకపోతే బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ హెచ్చరించామని ఆరోపించారు. ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షుడు మట్ట నరేష్, హాస్టల్ అధ్యక్షుడు నవీన్, నాయకులు రితీష్, విజయ్, మనోజ్, రుతీష్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నామని తెలిపారు.




