అక్టోబర్ 04 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
ఒకప్పుడు సాగునీళ్ల కోసం రైతులు తన్నుకునే పరిస్థితి ఉండే కాల్వలపై పెట్టిన మోటార్లను కాంగ్రెస్ పాలనలో అధికారులు కాల్వలో తన్నిన పరిస్థితి విద్యుత్ వైర్లను కోసేసిన పరిస్థితి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.
కాల్వలపై మోటార్లు పెట్టి బ్రహ్మాండంగా నీళ్లు పారించుకుంటున్నారు.
ఇవాళ మనకు కేసీఆర్ ధైర్యం రైతు రక్షణ కవచం మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
నిర్మల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో రూ 714 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ 27 లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
పోచంపాడ్ వద్ద రూ 300 కోట్లతో నిర్మించే పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
