బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆదేశం మేరకు ఈరోజు జన్నారం మండలం, భీమారం మండలం మరియు బెల్లంపల్లి పట్టణానికి నూతన మండల అధ్యక్షులను నియమించడం జరిగింది.
బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలిగా దార కల్యాణిని, భీమారం మండల అధ్యక్షులుగా బొరుకుంట శంకర్ ని, జన్నారం మండల అధ్యక్షునిగా గుండవరపు మధుసూధన్ రావుని నియమించడం జరిగింది. నూతనంగా నియామకం అయిన మండల అధ్యక్షులకు జిల్లా ప్రధాన కార్యదర్శులు రజనీష్ జైన్, దుర్గం అశోక్ మరియు పట్టి వెంకట కృష్ణ నియామక పత్రాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోంతం శంకరయ్య, చెన్నూర్ అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేష్, మంచిర్యాల అసెంబ్లీ కన్వీనర్ తోట మల్లికార్జున్, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రి నాయక్ పాల్గొన్నారు.
