రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ 154వ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా మార్గంలోనె భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడం జరిగిందన్నారు. దేశంలోని పేద ప్రజలందరూ ఒంటినిండా దుస్తులు ధరించిన రోజే తాను కూడా పూర్తిస్థాయిలో దుస్తులు ధరిస్తానని అన్నారు.
స్వదేశీ వస్తువులను మనం వాడాలని ఖాదీ ఉద్యమంలో రాత్నం వడికి నూలు తీసిన మహనీయుడు అన్నారు దక్షిణాఫ్రికాలో నల్లజాతీయుల కోసం స్వాతంత్ర పోరాటంలో పాల్గొని నేరుగా భారతదేశంలో స్వాతంత్రం కోసం ఉద్యమం నడిపిన మహనీయుడు అన్నారు.
