రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ నందు గల 17వ పోలీస్ బెటాలియన్ లో మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎస్ .శ్రీనివాస్ మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీజీ సౌత్ ఆప్రికాలో జాతి వివక్ష, భారత దేశంలో సహాయ నిరాకరణ, దండియాత్ర, ఖిలాపత్, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో ఉద్యమాలు చేసారని బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ అగ్రగామిగా నిలిచారు అని, సత్యం, అహింస వంటి పద్ధతుల ద్వారా అనేక ఉద్యమాలు చేశారు అని తెలిపారు. గాంధీ మహాత్ముడు ఈ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు అని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మా గాంధీ సిద్ధాంతాలను గౌరవిస్తూ, ఆయన అనుసరించిన అహింసా మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన్ని స్మరించుకునే లక్ష్యంతో ప్రపంచ దేశాలు కూడా గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినోత్సవంగా జరుపుకుంటున్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎన్నో పౌర ఉద్యమాలకు, పౌర హక్కుల పోరాటాలకు స్పూర్తి ప్రధాత అని మహాత్మా గాంధీ చూపిన మార్గంలో అందరు ముందుకు సాగాలని అన్నారు.
