ప్రాంతీయం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించిన సీఎం కేసీఆర్

193 Views

హైదరాబాద్ అక్టోబర్ 02
తెలంగాణలోని ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురును వినిపించింది. ఉద్యోగులకు పే స్కేల్‌ చెల్లింపు కోసం పే రివిజన్‌ కమిటీని,పీఆర్సీని, నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

ఈ మేరకు కమిటీ చైర్మన్‌గా ఎన్‌ శివశంకర్‌,రిటైర్డ్ ఐఎఎస్, సభ్యుడిగా బీ రామయ్య,రిటైర్డ్ ఐఏఎస్,సీఎం కేసీఆర్‌ నియమించారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఆరు నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించింది.

పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించింది. 5శాతం మధ్యంతర భృతి ఐఆర్‌,ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *