నెహ్రూ యువ కేంద్రం, రామసేన యూత్ వారి సౌజన్యంతో ఇంటర్నేషనల్ వాలంటరీ డే సందర్భంగా దుబ్బాక మండల పరిధిలోని లచ్చపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఉపన్యాస ,వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి దుబ్బాక mpdo భాస్కర శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి స్వచ్ఛంద సేవ కార్యక్రమాలను అలవర్చుకోవాలని, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా దేశ అభివృద్ధి, దేశ నిర్మాణం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన మోతే మహేందర్ మాట్లాడుతూ యువత విద్యార్థులు వారి యొక్క విజ్ఞానము తెలివితేటలు వ్యక్తిగత స్వార్థం కాకుండా కుటుంబం ,సమాజం, దేశం కోసం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో చిన్న చిన్న విషయాలకే యువత ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. .అవి కాకుండా వారి యొక్క సంతోషాన్ని పబ్బుల్లో క్లబ్బుల్లో గడపకుండా దేశ సేవలో గడపాల్సిన అవసరం యువతకు విద్యార్థులకు ఎంతైనా ఉందన్నారు. సమాజం కోసం దేశంలో చాలా స్వచ్ఛంద సంస్థలు వివిధ ఆర్గనైజేషన్సు పలు సేవా కార్యక్రమాలను నిస్వార్ధంగా పనిచేస్తున్నాయి. నేటి యువత వారి యొక్క ఆత్మవిశ్వాసం లేని కారణంగా నిర్వీర్యం అయిపోతున్నారు. ఆత్మవిశ్వాసం గల యువత చాలామందికి ప్రోత్సాహం ఇస్తూ చాలా స్వచ్ఛంద కార్యక్రమాలను ఏది ఆశించకుండా వాళ్ళు నిర్వహిస్తున్నారని తెలిపారు. సమాజంలోని యువత స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేయడంలో వెనకడుగు వేస్తున్నారని పొరుగువారు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడుతున్నారని స్వచ్ఛంద సేవపై సమాజానికి అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తదనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. దేశం మనకేమిచ్చిందని దూషించడం దోషం దేశానికి మనమిస్తే తీరును రుణ శేషం అని,అన్నారు. నెహ్రు యువ కేంద్ర ప్రతినిధి బాయికాడి లక్ష్మణ్, మాట్లాడుతూ మనకు జన్మనిచ్చి ఆజన్మాంతం సేవలు చేసే తల్లి ఎప్పుడైనా మన ఆనవాళ్లు అడగలేదు. అనామికత సందేశం మన జీవన విధానం అన్నారు .మన నుంచి ఏదీ ఆశించకుండా చేసేదే స్వచ్ఛంద సేవ అని అన్నారు. సమాజానికి అన్నాన్ని అందించే రైతు తన గింజపైన తన పేస్వార్థం లేకుండా నిస్వార్ధంగా సేవ చేసేవాళ్లను మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కర్మఫలం నాశించని ధర్మ వీరులు స్వచ్ఛంద సేవకులు అన్నారు . టీ,ఎస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సుప్రియ, రామసేన యూత్ అధ్యక్షులు గౌటి మహేష్ కార్యదర్శి నవీన్, కార్యక్రమం అధ్యక్షులు ఆసరి బాలు రామసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు




