తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్,అమిత్ షా రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు.
బిజెపి ఎన్నికల ప్రచార రోడ్ షో కార్యక్రమం మంచిర్యాల శ్రీనివాస టాకీస్ నుండి ముఖరం చౌరస్తా, మార్కెట్ ఏరియా, బస్టాండ్ ఏరియా మీదుగా భారతీయ జనతా పార్టీ రోడ్డు షో నిర్వహించడం జరిగింది.
అమిత్ షా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వుకు ఓటు వేసి మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల నియోజకవర్గ ప్రజలను కోరారు.
అదేవిధంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బిసి నే ముఖ్యమంత్రి చేస్తానని ఆయన తెలిపారు. భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్ షోలో పాల్గొని పాల్గొన్నారు.
