తెలంగాణలో ప్రతి పచ్చని పొలాల్లో మా తాతను చూస్తాను: హిమాన్సు
హైదరాబాద్:అక్టోబర్ 02
సీఎం కేసీఆర్‌పై ఆయన మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘కొంతమంది ద్వీపాలలో వారి విగ్రహాలను చూస్తారు. మరికొందరు వాటిని ఎడారులలో చూస్తారు.. కానీ నేను తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలో మా తాతను చూస్తాను’ అంటూ పచ్చని పొలాల్లో కేసీఆర్ ఆకారంలో ఉన్న ఫొటోను హిమాన్షు షేర్ చేశాడు.
హిమాన్షు ప్రస్తుతం విద్యనభ్యసిస్తుండగా.. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. కానీ సోషల్ మీడియాలో కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెడుతూ చర్చనీయాంశంగా మారుడుతున్నాడు.
తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వరుస పర్యటనలు, బహిరంగ సభలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ మళ్లీ రావాలని హిమాన్షు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఈ ట్వీట్‌తో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున హిమాన్షు సోషల్ మీడియాలో ప్రచారం చేయనున్నాడని అర్థమవుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. మంత్రి కేటీఆర్ తరహాలోనే ఆయన కుమారుడు హిమాన్షు కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటాడు. కేసీఆర్, కేటీఆర్ గురించి పోస్టులు పెడుతూ ఉంటారు. అలాగే సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటాడు..





