ఏబిజెఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానాలో పండ్లు పంపిణీ
అక్టోబర్ 6
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ దావాఖానాలో శుక్రవారం అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రాజేష్ జన్మదినం పురస్కరించుకొని ఏబిజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ లింగం ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్ అందజేశారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏబిజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ దావాఖానాలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని జర్నలిస్టుల సంక్షేమం కోసం అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ స్థాపించి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజేష్ జర్నలిస్టులకు అండగా ఉంటూ.
మా అందరి అభిమానం పొందిన ఏబిజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏబిజేఎఫ్ నాయకులు మల్లేష్ యాదవ్,నరేష్ గౌడ్, దొడ్డచారి,శ్రీకాంత్,శేఖర్, ప్రభాకర్, నరేష్, దశరథ్, తదితరులు పాల్గొన్నారు
