అక్టోబర్ 01 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
బీఆర్ఎస్, బీజేపీ, పార్టీల నుంచి స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో చేరికలు.
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానించిన ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నుండి చుంచు జగదీశ్, బత్తుల బాబూరావు మరియు వారి అనుచరులు దాదాపు 150 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ప్రేమ్ సాగర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ కుటుంబంలోకి అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి స్వాగతం పలుకుతున్న.
గత ఎన్నికల్లో ఓటమి చెందిన మీకు నిత్యం సేవ చేస్తూనే ఉన్నాను. ఒక్కసారి గెలిపిస్తే మీ రుణం తీర్చుకునేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా.
వచ్చే ఎన్నికల్లో నేను గెలిచిన వెంటనే కాలువల ద్వారా ఇక్కడి పంటపొలాలు సాగు నీళ్లు అందిస్తాను.
కాలువల ద్వారా పంటపొలాలకు నీళ్లు అందించేందుకు అవసరమైన పూర్తి ప్రణాళిక మా వద్ద ఉంది.
అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు తీయిస్తాం.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ప్రజలు, బీఆర్ఎస్, ఇతర పార్టీ నాయకులు మొత్తంగా కాంగ్రెస్ లో చేరుతున్నారు.
అధికార పార్టీ రేపు ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లకు సైతం దొరకని పరిస్థితి.
సోనియమ్మ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం.
మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్ రామగిరి బానేష్, యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా సెక్రటరీ శ్రావణ్ రావు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సల్ల మహేష్,మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, నాయకులు స్వామి తదితరులు పాల్గొన్నారు.
