దౌల్తాబాద్: క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ దుబ్బాక నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన పాస్టర్ రాజా జోసెఫ్ ఎన్నికయ్యారు. శనివారం సిద్దిపేటలోని జిల్లా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సమావేశంలో రాజాజోసఫ్ ను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మార్కు, ఉపాధ్యక్షుడిగా దయారత్నం, సెక్రటరీగా జీవన్ రాజ్, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజా జోసెఫ్ ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పాస్టర్ల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా ఇన్చార్జులు దాస్ ఎల్లం, బిఎస్ రూబెన్ ల ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవ ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
