Breaking News

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.

89 Views

జగిత్యాల అక్టోబర్ 1:జగిత్యాల జిల్లా:అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.

అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్బంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్ ,జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా .

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..
తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి,భద్రతకు,వారు గౌరవంగా జీవించేందుకు అవసరమైన సహాయం అందిస్తుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వృద్దులకు నేనున్నానంటూ ఇంటికి పెద్దకొడుకు వలే ఆదుకుంటూ ఆసరాగా నిలుస్తున్నారు.

రాష్ట్రంలో ఆసరా పెన్షన్ ద్వారా వృద్దులకు నెలకు 2016/- అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ, ముఖ్యమంత్రి ఒక్క కెసిఆర్ మాత్రమే.

రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కరీంనగర్,రంగారెడ్డి జిల్లాలో వృద్ధాశ్రమాలు నడుపబడుతున్నాయి.

వయోవృద్ధుల సహాయార్ధం 14567 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడమైనది.

కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి. ఎస్ లత,అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ సీనియర్ సిటిజన్స్ జి.ఆర్ దేశాయ్,హరి అశోక్ కుమార్,సతీష్ రాజ్,శ్రీ మంజరి, డి డబ్ల్యూ ఓ నరేష్ ,జిల్లా సంక్షేమ అధికారులు,సీనియర్ సిటిజన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *