నేడు మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ నాయకులు మందమరికి మునిసిపల్ ఎలక్షన్స్ జరిపించాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు.
మందమరి మున్సిపాలిటీలో 60 వేలకు పైగా జనాభా ఉన్నారు మరియు 22 వార్డులుగా విభజించడం జరిగింది అయినప్పటికీ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ మందమరిలో జరిపించడం లేదు అందువలన మున్సిపాలిటీకి సరైన నాయకుడు లేకుంటే పోయారు, మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి చెందడం లేదు
దీనిపైన వెంటనే తగు చర్య తీసుకుని మందమరి మున్సిపాలిటీలో మునిసిపల్ ఎన్నికలు జరిగేలా చూడాలని సిపిఐ నాయకులు మంత్రి తారక రామారావును కోరారు.
