దౌల్తాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. నిమజ్జనానికి ముందు ప్రత్యేక పూజలు చేసి గ్రామాల్లోని పలు విధుల గుండా శోభా యాత్ర నిర్వహించారు. యువకులు, చిన్నారులు, నిర్వాహకులు నృత్యం చేశారు. పలు గ్రామాల్లో లడ్డువేలం పాట నిర్వహించగా భక్తులు పోటీపడి లడ్డును దక్కించుకున్నారు. సాయంత్రం సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. మండల పరిధిలోని ఇందూప్రియల్ గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
