దౌల్తాబాద్: మన ఆరోగ్యం కోసం తప్పనిసరిగా పరిసరాల శుభ్రత పాటించాలని సర్పంచ్ అప్పవారి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హంసకేతన్, వార్డు సభ్యులు రమణ, అంగన్వాడి టీచర్ సరోజన, ఏఎన్ఎం విజయ తదితరులు పాల్గొన్నారు….




